జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్‌పై మరింత పట్టుసాధిస్తున్నది. 2023లో సంస్థ 22,940 యూనిట్ల లగ్జరీ కార్లు, మోటర్‌సైకిళ్లను విక్రయించింది.
బీఎండబ్ల్యూ కూడా వాహన ధరలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 2 శాతం సవరిస్తున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.