రాధకు ప్రాణం కిట్టయ్య. కిట్టయ్యకు ఆరోప్రాణం రాధ. రాధామాధవుల ప్రేమకు వేదిక యమున. యమునా తీరంలో భాషలో రాయలేని రాసలీలలెన్నో! రాసలీల వేళ రాయబారం సాగించిన యమున ప్రేమ తరంగిణి.
డాక్టర్ సి.నారాయణ రెడ్డి ‘నిలువెత్తు తెలుగు సంతకం’ మాత్రమే కాదు... ప్రయోగానికి పర్యాయపదం, సంప్రదాయానికి ‘నిక్కమైన’ నీలం. అది పాటైనా, మాటైనా, తన బాటైనా ఆయన ముద్ర ఆయనదే! ఏడున్నర దశాబ్దాలు ఇటు కవిత్వం లోనూ... అ�