Vani Jayaram: మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పాటతో ఆకట్టుకున్న వాణీజయరాం.. వీడియో
Vani Jayaram:కళ్యాణి రాగంలో దొరకునా ఇటువంటి సేవా.. శుభపంతువరలి రాగంలో మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా.. అమృవర్షిణి రాగంలో ఆనతినీయరా హరా పాటలతో వాణీజయరాం తెలుగు ప్రేక్షకుల్ని మైమరిపింప చేశారు.
హైదరాబాద్: సీతాకోక చిలుక చిత్రం ఓ సూపర్ హిట్ ఫిల్మ్. ఆ సినిమాలో వాణీజయరాం పాడిన మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా సాంగ్ మరో సూపర్ హిట్. అద్భుతమైన స్వరంతో వాణి పాడిన ఆ పాట చార్ట్‌బస్టర్ లిస్టులో చాన్నాళ్లూ మారుమోగింది. భిన్నమైన స్వరంతో వాణీజయరాం ఆ నాటి యువతను ఉర్రూతలూగించారు. 10 వేలకుపైగా పాటలు పాడిన 79 ఏళ్ల వాణీజయరాం ఇవాళ కన్నుమూశారు. వాణీజయరాం పాడిన ఆ పాట వీడియోను ఓసారి చూడండి..
ఇళయరాజా ఈ పాటకు మ్యూజిక్ అందించారు. కర్నాటక సంగీతంలోని శుభపంతువరలి రాగంలో సాగే ఈ యుగళ గీతాన్ని వాణీ రసరమ్యంగా పాడారు. భారతీరాజా కూడా ఆ సాంగ్‌ను చిత్రీకరించిన తీరు అనిర్వచనీయం. తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, అస్సాం, బెంగాలీ భాషల్లోనూ ఆమె తన స్వరాలతో ప్రేక్షకుల్ని రంజింప చేశారు. వాణీ జయరాం గాత్రం విభిన్నమైంది. అయిదు దశాబ్ధాల పాటు ఆమె తన మధురమైన స్వరంతో సినీ లోకాన్ని ఏలారు.
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఆమెకు మూడుసార్లు జాతీయ అవార్డు వచ్చింది. గత వారమే ఆమె పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైంది. శంకరాభరణం సినిమాకు ఆమె తన స్వరాన్ని అందించారు. ఆ ఫిల్మ్‌లో ఆమె పాడిన దొరకునా ఇటువంటి సేవా పాటకు జాతీయ అవార్డు దక్కింది. ఇక స్వాతికిరణం ఫిల్మ్‌లో పాడిన ఆనతినీయరా హరా పాటకు కూడా ఆమెకు జాతీయ అవార్డు దక్కడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

