జిల్లాలో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మే 1వ తేదీ నుంచి జూన్ 6 వరకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రాంచందర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా యువజన, క్రీడాశాఖ, కరీంనగర్ బల్దియా సహకారంతో ప్రతి సంవత్సరం నగరంతో పాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాల(సమ్మర్ క్యాంప్)ను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు.