రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు.
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలత మిగిలిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.