అనేక అడ్డంకులు, అవాంతరాలు, అనుమతుల్లో జాప్యం. ఇలా మొత్తంగా 9 ఏండ్ల సింగరేణి సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. రాష్ట్రం బయట సంస్థ చేపట్టిన తొలి బొగ్గు గని ‘నైనీ’లో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నది.
శ్రీరాంపూర్ : సింగరేణి సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రంలో చేపడుతున్న మొదటి బొగ్గు గని నైనీ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు అతి కీలకమైన తొలిదశ అటవీ అనుమతి లభించింది. సింగరేణికి అటవీ భూమి �