మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం పరిగి పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి ఊరేగింపు ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.
సద్గురు సేవాలాల్ మహరాజ్ భావాలు, ఆశయాలను అనుసరించి ప్రజలు ముందుకు సాగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్‌లో సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.