మేడారం మహాజాతర ముగిసింది. వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు భక్తుల మొకులు అందుకొన్నారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) వన దేవతలను శనివారం సాయంత్రం వనంలోకి తీసుకెళ్లారు
ఆ జాతర అడవి తల్లులది. కానీ.. అంతర్జాతీయ ఖ్యాతి. ఆ ఉత్సవం కొండకోనల్లో జరుగుతుంది. అయితేనేం, తండోపతండాలుగా భక్తులు. తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు ఘనంగా జరుగనుంది