రిటైర్డ్ జడ్జిలను ఉద్దేశించి కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ‘భారత వ్యతిరేక ముఠా’గా పేర్కొనడాన్ని ఖండించారు.
న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా లేదన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐలు కౌంటర్ ఇచ్చారు.