మిషన్ కాకతీయ ఫలాలకు నిలువెత్తు నిదర్శనం కాకతీయుల కాలం నాటి చందుపట్ల రాసముద్రం చెరువు. ఒకప్పుడు వరద కోసం ఎదురుచూసే రైతులకు ప్రస్తుతం ఎప్పుడైనా చెరువు అడుగు చూద్దామంటే వీలు కావట్లేదు.
సీఎం కేసీఆర్ | మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా పలుగు, పార పట్టి పూడికతీత పనులను ప్రారంభించిన జిల్లాలోని నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాసముద్రం (పెద్ద చెరువు) జలకళను సంతరించుకుంది.