ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. భూమిలో పూడుకుపోయిన 64కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్'ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు.
ప్రపంచ వింతల్లో పిరమిడ్లు కూడా ఒకటి. దాదాపు 4 వేల ఏండ్ల కిందట నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రపంచ పర్యాటకులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి.