PFI | పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.
ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శుక్రవారం కేరళలో చేపట్టిన బంద్ హింసకు దారితీసింది. పలువురు పీఎఫ్ఐ సభ్యులు పలు బస్సులు, వాహనాలను, రోడ్డు పక్కన దుకాణాలను ధ్వంసం చేశారు.