PFI | దసరా ఉత్సవాలు టార్గెట్‌గా పీఎఫ్ఐ ఉగ్రకుట్ర.. మరోసారి ఎన్ఐఏ రెయిడ్స్
PFI | పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.
ఉగ్రవాద రిక్రూట్మెంట్ సంస్థ పీఎఫ్ఐ.. దేశంలో జరగనున్న దసరా ఉత్సవాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ఐ సభ్యులు కొందరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలోనే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దసరా సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్‌గా ఉగ్రదాడులు చేయాలని పీఎఫ్ఐ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 8 రాష్ట్రాల్లో పలుచోట్ల రెండు దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అస్సాంలో దాడులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు ఆపరేషన్‌లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐబీ, రాష్ట్ర పోలీసులు కూడా కొన్ని చోట్ల పాలుపంచుకున్నట్లు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు ఇలా దేశంలో ఉన్న పీఎఫ్ఐ కార్యకలాపాలపై దాడులు నిర్వహించడం గత రెండు వారాల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ED
- NIA raids
- PFI
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

