సాధారణంగా చాలా మంది తమకు తెలిసిన పండ్లనే తరచూ తింటుంటారు. వాటిల్లో సీజనల్ పండ్లు కూడా ఉంటాయి. అయితే తెలియని పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నా వాటి గురించి అంతగా పట్టించుకోరు.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్ బెర్రీ.. ఇలా అనేక రకాల బెర్రీ పండ్ల గురించి మీరు వినే ఉంటారు. ఆయా పండ్లను చూసి కూడా ఉంటారు. కానీ మల్బెర్రీ పండ్లను మీరు ఎప్పుడైనా చూశారా..? ఈ పేరును చాలా మంది వినే ఉంటారు.