మాతృ భాష.. అమ్మ భాష.. మదర్ టంగ్.. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలంగాణ తల్లి/ తెలుగు తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం.
మాతృభాషకు విధిగా మర్యాదనిస్తూనే పరభాషలను గౌరవించుకోవాలని, మన సంస్కృతికి మాతృభాషే తల్లివేరులా పనిచేస్తుందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి అన్నారు.