ఊర్మిళా చౌహాన్.. నడిచినంత మేరా సౌందర్య సామ్రాజ్యమే. ఎక్కడికెళ్లినా రోజాపూల రెడ్ కార్పెట్ స్వాగతాలే. ఈ విజయమేం అయాచితంగా రాలేదు. దాని వెనుక ఎంతో తపన ఉంది. మనుగడ కోసం పోరాటమూ ఉంది.
అందాల పోటీలో కిరీటం అందుకొని, మోడలింగ్‌లో నిరూపించుకొని, ఆ తర్వాత వెండితెరపై తళుక్కుమన్న నాయికలు చాలామందే ఉన్నారు. కానీ మోడలింగ్‌లో మెరిసి, అందాల పోటీల్లో గెలిచి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది హైదరాబాద