ఈ నగరానికి రాణి ఎలా అయింది..‘మిస్ ఇండియా తెలంగాణ’ముచ్చట్లు

అందాల పోటీలో కిరీటం అందుకొని, మోడలింగ్‌లో నిరూపించుకొని, ఆ తర్వాత వెండితెరపై తళుక్కుమన్న నాయికలు చాలామందే ఉన్నారు. కానీ మోడలింగ్‌లో మెరిసి, అందాల పోటీల్లో గెలిచి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది హైదరాబాదీ సొగసరి సిమ్రాన్ చౌదరి. వాలు చూపుతో మంత్రం వేసే ఈ ముగ్ధ క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ‘మిస్ ఆంధ్రప్రదేశ్’, ‘టాలీవుడ్ మిస్ హైదరాబాద్’, ‘మిస్ ఇండియా తెలంగాణ’ కిరీటాలు దక్కించుకున్న సిమ్రాన్ గురించిన ముచ్చట్లు..
సిమ్రాన్ పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. చిన్నప్పుడే కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఆటల్లోనూ మేటి అనిపించుకుంది. డిగ్రీ చదివే రోజుల్లో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిగా రాణించింది. మోడలింగ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి, 2012లో ‘మిస్ ఆంధ్రప్రదేశ్’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ‘టాలీవుడ్ మిస్ హైదరాబాద్’ పోటీల్లోనూ విజేతగా నిలిచింది.
- చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరిన సిమ్రాన్.. మోడలింగ్, యాక్టింగ్ మీద ఇష్టంతో ఆ కొలువును కాదనుకుంది. 2017లో ‘మిస్ ఇండియా తెలంగాణ’తోపాటు ‘మిస్ టాలెంట్’ టైటిల్‌ని కూడా సొంతం చేసుకుంది. ‘వావ్’ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది. ‘ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్’ రియాలిటీ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కొట్టేసింది. అలా, అనేక అవకాశాలు తలుపుతట్టాయి.
- షార్ట్‌ఫిల్మ్ ‘బ్రాహ్మణుల అమ్మాయి- నవాబుల అబ్బాయి’లో సంప్రదాయ కట్టుబొట్టుతో ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే, సినిమాల్లోనే కాదు బయట కూడా సంప్రదాయ దుస్తులకే ఓటేస్తుందట సిమ్రాన్. నిండైన దుస్తులు వేసుకుంటేనే తనకు సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నది.
- కూచిపూడి డ్యాన్సర్‌గా రాణిస్తూ అందరి మన్ననలూ అందుకుంటున్నది. ఎంత బిజీగా ఉన్నా, రోజూ ఎంతో కొంతసేపు పుస్తకాలు చదవడం తన
- అలవాటు. అంతేకాదు, యోగా, గ్రీన్‌టీతో తన దినచర్య ప్రారంభిస్తుందట.
- 2014లో ‘హమ్‌తుమ్’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సిమ్రాన్, తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పటి వరకూ చిన్న సినిమాలకే పరిమితమైనా ‘చెక్’తో పెద్ద మూవీస్‌కి గురిపెట్టింది.
- సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సిమ్రాన్‌కి గార్డెనింగ్, పెట్స్ అంటే చాలా ఇష్టం. తల్లి సాగుచేస్తున్న మిద్దెతోట కబుర్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

