రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని చర్చిలకు వెళ్లి తమకు ఆయురారోగ్యాలు కలగాలని, సిరిసంపదలు కలుగజేయాలని యేసు ప్రభువును వేడుకొన్నారు.
మెతుకుసీమలోని (Medak) సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ (Christmas) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్రమైన రోజున ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.