ధైర్య సాహసాలు, పోరాటాలకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం అని,ఆడవాళ్లు ఎందులోనూ తక్కువకాదని నిరూపించిన ధీర వనిత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ను విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం పరామర్శించారు.