Varun Raj | అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా విద్యార్థి వరుణ్ రాజ్ (Varun Raj) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. లూథరన్ దవాఖానలో (Lutheran Hospital) చికిత్స పొందుతున్న ఆయన ఇంకా కోమాలోనే ఉన్నాడు.
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన 24 ఏండ్ల తెలంగాణ విద్యార్థిపై దాడి జరిగింది. ఇండియానా రాష్ట్రం వాల్పరైసో నగరంలోని పబ్లిక్ జిమ్‌లో వరుణ్ రాజ్‌పై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు.