ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, అభివృద్ధి చేయకుండా చేసిన అభివృద్ధి ఆనవాళ్లు చెరిపేయడం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ‘కేసీఆర్ కళాభారతి’ నుంచి కేసీఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.