నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటఖుర్దులో (Pentakhurdu) కొత్త కల్యాణి చాళుక్యుల శాసనం వెలుగు చూసిందని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
కళ్యాణి చాళుక్యులు శివుడికి ఎంతో భక్తితో నిర్మించిన ఆలయమది. ఆ ఆలయంలోని శిల్పసంపద చూసినవారు అచ్చెరువొందక మానరు. కళ్లను మిరిమిట్లు గొలిపే శిల్పకళా సంపద ఆ ఆలయం సొంతం.