ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క థియేట్రికల్ హిట్టు కొట్టలేకపోయాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. శోభన్ నటించిన గత మూడు సినిమాలైతే డిజాస్టర్ ఫలితాలను మూటగట్టుకున్నాయి.
సంతోష్ శోభన్, ప్రియ భవానీశంకర్ జంటగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు.