Kalyanam Kamaneeyam Movie On OTT | ఇండస్ట్రీకి వచ్చి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క థియేట్రికల్ హిట్టు కొట్టలేకపోయాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. శోభన్ నటించిన గత మూడు సినిమాలైతే డిజాస్టర్ ఫలితాలను మూటగట్టుకున్నాయి. కథల పరంగా ఒకే అనిపించినా అవుట్ పుట్ సరిగ్గా లేక మిస్‌ఫైర్ అవుతున్నాయి. ఇక ఇటీవలే వచ్చిన కళ్యాణం కమనీయం సైతం డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. అప్పటికే వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య జోరు ఊపందుకోవడంతో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. పైగా మొదటి రోజే ఈ సినిమా డివైట్టాక్ తెచ్చుకుంది. దాంతో వారం తిరగకుండానే దుకాణం సర్దేసింది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఫిబ్రవరి 17నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అనీల్‌కుమార్ అల్ల దర్శకత్వం వహించాడు. యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ ద్వారా సేఫ్ అయినట్లు తెలుస్తుంది. కేవలం నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ సినిమాకు దాదాపు రూ.7 కోట్లు ముట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ 5కోట్లలోపే పూర్తయింది. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలకు థియేట్రికల్ రిలీజ్లో వచ్చిన నష్టాలను డిజిటల రైట్స్ పూడ్చినట్లే.