దేశంలో రక్తహీనత (అనీమియా) ఇప్పటికీ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. శరీరానికి అవసరమైన ఇనుము (ఐరన్) లోపించడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.
కారణాలు ఏవైనా ఇటీవలికాలంలో సప్లిమెంట్ల వాడకం ఎక్కువైంది. సమతౌల్య ఆహారం తీసుకోలేక చాలామంది సప్లిమెంట్ల వెంట పడుతున్నారు. అవసరమైన విటమిన్లు, పోషకాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటూ అదే ఆరోగ్యమని భావిస్తు�