Iron Supplements | ఐరన్ సప్లిమెంట్లతో హైపర్ టెన్షన్.. అతిగా వాడితే డయాబెటిస్ ముప్పు
కారణాలు ఏవైనా ఇటీవలికాలంలో సప్లిమెంట్ల వాడకం ఎక్కువైంది. సమతౌల్య ఆహారం తీసుకోలేక చాలామంది సప్లిమెంట్ల వెంట పడుతున్నారు. అవసరమైన విటమిన్లు, పోషకాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటూ అదే ఆరోగ్యమని భావిస్తున్నారు.
- ఐరన్‌ను సహజంగా పొందడమే ఉత్తమం
- జాతీయ పోషకాహార సంస్థ సూచన
Iron Supplements | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కారణాలు ఏవైనా ఇటీవలికాలంలో సప్లిమెంట్ల వాడకం ఎక్కువైంది. సమతౌల్య ఆహారం తీసుకోలేక చాలామంది సప్లిమెంట్ల వెంట పడుతున్నారు. అవసరమైన విటమిన్లు, పోషకాలను సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటూ అదే ఆరోగ్యమని భావిస్తున్నారు. నిజానికిది అత్యంత ప్రమాదకరమని జాతీయ పోషకాహార సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. మరీ ముఖ్యంగా ఐరన్‌ను ఆహారం ద్వారా కాకుండా సప్లిమెంట్ల ద్వారా తీసుకోవడం వల్ల టైప్-2 డయాబెటిస్, హైపర్ టెన్షన్ బారినపడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఐరన్‌ను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం కంటే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిదని సూచించింది. అధ్యయనంలో భాగంగా ఐరన్ సప్లిమెంట్లను ఓరల్‌గా తీసుకుంటున్నవారు, తీసుకోని వారి ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేశారు. ఐరన్‌ను సప్లిమెంట్ల ద్వారా తీసుకునే వారితో పోల్చితే తీసుకోని వారిలో డయాబెటిస్ మిల్లిటస్ (డీఎం) తక్కువగా ఉన్నట్టు తేలింది. హైపర్ టెన్షన్ లక్షణాలు కూడా వారిలో లేనట్టు గుర్తించారు.
తాత్కాలికమైతే ఓకే
విటమిన్లు, మినరల్స్ కోసం చాలామంది సప్లిమెంట్లపై ఆధారపడుతుంటారు. ఇది తాత్కాలికంగా అయితే ప్రమాదమేమీ లేదు కానీ, దీర్ఘకాలం పాటు అదే పనిగా వాడితే ముప్పు తప్పదని అధ్యయనకారులు హెచ్చరించారు. అధ్యయనంలో భాగంగా దేశవిదేశాల్లోని 3.2 లక్షల మందిని, 28,837 కేస్ స్టడీలను పరిశీలించారు. వయసు, లింగం, బీఎంఐ, హైపర్ టెన్షన జీవనశైలి, ఆహారపుటలవాట్లు వంటివాటిని పరిగణనలోకి తీసుకుని సుదీర్ఘకాలంపాటు అధ్యయనం నిర్వహించారు. పరిమితికి మించకుండా కొద్దికాలంపాటు సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ప్రతిరోజు 5-20 ఎంజీకి మించి వాడితే మాత్రం టైప్-2 డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి లక్షణాలు కనిపించినట్టు అధ్యయనంలో గుర్తించారు.
మెట్రో నగరాల్లోనే ఎక్కువ
పల్లెలతో పోలిస్తే పట్టణాలు, నగరవాసుల జీవనశైలి భిన్నంగా ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో దొరికింది తిని పరుగులు పెడుతూ ఉంటారు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సరిపడా అందక సప్లిమెంట్లు తీసుకోని తప్పని పరిస్థితి ఎదురవుతున్నది. వీటిని దీర్ఘకాలం వాడడం వల్ల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో రసాయనిక అవశేషాలు చేరవని, ఫలితంగా జీవక్రియలు సజావుగా సాగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఐరన్ పుష్కలంగా లభించే ఆహారపదార్థాలివే
కూరగాయలు
- పాలకూర
- కందగడ్డ
- బఠానీలు
- బ్రకోలి
- స్ట్రింగ్ బీన్స్
- సోయాబీన్స్
- గుమ్మడి గింజలు
- క్వినోవా
మాంసం/సముద్ర ఉత్పత్తులు
- మేక,పొట్టేలు మాంసం
- చికెన్
- లివర్
- రొయ్యలు
- గుడ్లు
- చేపలు
- టర్కీ
- ట్యూనా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

