స్త్రీ హృదయాన్ని తెలుగువారికి ఆవిష్కరించడానికి అహరహం శ్రమించాడు చలం. అదే రీతిన నాటక రంగంలో స్త్రీ సమస్యను, హృదయాన్ని ‘గోగ్రహణం’ అనే నాటికలో ఏకకాలంలో గొప్పగా ఆవిష్కరించాడు తనికెళ్ళ భరణి.
కథ కూడా సృజనాత్మక ప్రక్రియేనని అందరూ ఒప్పుకుంటున్నా, నిజానికి కల్పితానికి, సృజనకు వ్యత్యాసం ఉన్నది. కథలో రచయిత ఊహకు సృజన అవసరమైనా, అది అక్కడే ఆగిపోతే దానిని ‘కల్పితం’ అంటారు.
సాహిత్యం ఎందుకు చదవాలో స్పష్టంగా దాని నిర్వచనమే చెప్తుంది. సహితస్య భావః సాహిత్యమ్, అంటే హితంతో కూడినది, హితాన్ని చేకూర్చేది సాహిత్యం. సాహిత్యం చదివిన వారు మానవునిలో మాధవుణ్ణి చూడగలగాలి.