అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు.
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్లకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.