భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటలకు 44 అడుగలకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
గోదావరి జలాలను ఎత్తిపోసి నగరానికి నీరందించేందుకు జలమండలి సిద్ధమైంది. శనివారం నుంచి ఎల్లంపల్లి నుంచి ఐదు పంపుల ద్వారా జలాలను ఎత్తిపోసి నగరానికి 168 ఎంజీడీల మేర నీటిని అందించనున్నారు.