‘ఒక్క ఎమ్మెల్సీ ఓటమితో నా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి ఓడినా నష్టమేం లేదు’ అని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ ఉసురుతీసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది.