రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
- ఆర్టీసీ పనితీరుపై సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైదరాబాద్‌లోని బస్ భవన్లో శనివారం ఆయన ఆర్టీసీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీలోని ఆయా విభాగాల పనితీరు, మహాలక్ష్మి పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థిక అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని సమర్థంగా అమలుచేస్తున్న సిబ్బందిని మంత్రి అభినందించారు. శుక్రవారం నాటికి 68.60 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుని, రూ.2350 కోట్లు ఆదా చేసుకున్నారని చెప్పారు.
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడున్న సర్వీసుల కంటే మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 3,035 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఆర్పీఎస్ బాండ్లకు సంబంధించిన రూ.200 కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఏడాది 38 డిపోలు లాభాల్లో ఉన్నాయని, కార్గో సేవలను విస్తరించేందుకు రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు క్షేమంగా ప్రయాణిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే సంస్థ బిలియన్ డాలర్ (రూ.8500 కోట్లు) టర్నోవర్ కార్పొరేషన్‌గా అవతరించబోతున్నదన్నారు. సమీక్షలో సంస్థ సీవోవో రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, వినోద్‌కుమార్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

