కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. జయాపజయాలు మన చేతిలో ఉండవు. ప్రయత్నించడం వరకే మన పని. ఫలితంతో సంబంధం లేకుండా వృత్తిని ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్నా’ అని చెప్పింది కథానాయిక కేతిక శర్మ.
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సింగిల్' ఈ నెల 9 ప్రేక్షకుల ముందుకురానుంది. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకుడు. ఆద్యంతం వినోదాత్మకంగా ముక్కోణపు ప్రేమకథగ�