సింగిల్‌గానే ఉన్నా!
కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. జయాపజయాలు మన చేతిలో ఉండవు. ప్రయత్నించడం వరకే మన పని. ఫలితంతో సంబంధం లేకుండా వృత్తిని ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్నా’ అని చెప్పింది కథానాయిక కేతిక శర్మ.
‘కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. జయాపజయాలు మన చేతిలో ఉండవు. ప్రయత్నించడం వరకే మన పని. ఫలితంతో సంబంధం లేకుండా వృత్తిని ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్నా’ అని చెప్పింది కథానాయిక కేతిక శర్మ. ఈ భామ శ్రీవిష్ణుతో కలిసి నటించిన తాజా చిత్రం ‘సింగిల్’ ఈ నెల 9న విడుదలకానుంది. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్‌రాజు దర్శకుడు. ఈ సందర్భంగా మంగళవారం కేతిక శర్మ విలేకరులతో ముచ్చటించింది. ఈ సినిమాలో తాను పూర్వ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, తను ప్రాక్టికల్‌గా ఆలోచించే స్వతంత్ర భావాలు గల యువతి అని చెప్పింది. ఆద్యంతం చక్కటి వినోదంతో సాగే ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని, హృదయాన్ని తాకే ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలిపింది.
శ్రీవిష్ణుతో పనిచేయడం హ్యాపీగా ఉందని, తన కామెడీ టైమింగ్ చాలా స్పెషల్ అని కేతిక శర్మ పేర్కొంది. డ్రీమ్ రోల్ గురించి చెబుతూ ‘రష్మిక మందన్న ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా చేస్తున్నది. అందులో ఆమెది అద్భుతమైన పాత్ర. ఆ తరహా క్యారెక్టర్ చేయాలన్నది నా డ్రీమ్. సాయిపల్లవి, కీర్తి సురేష్ మాదిరిగా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ ‘ప్రస్తుతానికైతే సింగిలే. మనసుకు నచ్చిన వారు తారసపడితే ప్రేమలో పడతానేమో? ఇప్పుడు నా దృష్టంతా కెరీర్ మీదే ఉంది’ అని చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

