మా ప్రాణం పోయినా ఫోర్త్ సిటీకి మా భూములు ఇవ్వం, మీరు బలవంతంగా రోడ్డు వేయాలంటే మా శవాల మీదుకెళ్లి రోడ్డు వేయాలి అని ఫోర్త్ సిటీ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు హెచ్చరించారు.
నిరుద్యోగుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.