భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.
‘పారిస్ ఒప్పంద’ లక్ష్యాలు ప్రమాదంలో పడ్డాయని, మరోవైపు 2024 ఏడాదిలో ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను చేరుకోనున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.