తెలంగాణ ఘనమైన చరిత్రను, అస్తిత్వాన్ని మరోసారి కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు.. కొత్త తెలంగాణ చరిత్ర బృందం, తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సౌజన్యంతో ‘తెలంగాణ పునర్దర్శనం’ పేరుతో సదస్సు నిర్వహణకు సిద్ధమైంది.
ప్రముఖ చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ రచించిన ‘తొలుచు వాన్డ్రు’, ‘తెలంగాణ చరిత్ర తొవ్వలో’ అనే రెండు పుస్తకాలను రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ గురువారం ఆవిష్కరించారు.