ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పో తుండడంతో చలి తీవ్రత అధికమైనది. దీనికి తోడు ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇద్దరు యవకులు బైక్పై వెళ్లే సమయంలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్న ఆలోచన చేశారు.