ఏదైనా రోగం వచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల మెట్లెక్కితే చాలు.. వాటి యాజమాన్యాలు, వైద్యుల బృందాలు కలిసి రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అప్పటికీ ధన దాహం చల్లారక కాసుల కోసం వక్రమార్గాలను ఎంచుకుంటున్నాయి.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని మహేశ్ స్పెషాలిటీ దవాఖానలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లులు సృష్టించిన విషయంపై సోమవారం జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ విచారణ చేపట్టారు.