Telangana | రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడం, ప్రభుత్వం పంటలు కొనకపోవడం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
మిర్చి దిగుబడి ఈ సంవత్సరం అధికంగా రావడంతో పాటు పక్క రాష్ర్టాల్లో కూడా పంట బాగా పండింది. దీనికి తోడు విదేశాలకు మిర్చి ఎగుమతుల డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.