సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల్లో మరోసారి బాలికలు రాణించారు. గత ఏడాదితో పోలిస్తే 90-95 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల శాతం కూడా పెరిగింది. సోమవారం సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలను విడుదల చేసింది.
2025-26 అకడమిక్ సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడంపై విధివిధానాలు రూపొందించాలని సీబీఎస్ఈని కేంద్ర విద్యా శాఖ కోరిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.