సీబీఎస్ఈ విద్యార్థులకు ప్రియాంక గాంధీ మద్దతు
సీబీఎస్ఈ | సీబీఎస్ఈ విద్యార్థులకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారు. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో

న్యూఢిల్లీ : కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు ఆన్లైన్లో పిటిషన్ పెట్టిన విషయం విదితమే. మే నెలలో నిర్వహించే పరీక్షలను రద్దు చేయాలి లేదా ఆన్లైన్లో నిర్వహించాలని కోరుతూ లక్ష మంది విద్యార్థులు ఆ పిటిషన్‌పై సంతకాలు చేశారు.
ఈ క్రమంలో సీబీఎస్ఈ విద్యార్థులకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారు. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం లేదా ఇతర మార్గాల్లో(ఆన్లైన్) పరీక్షలు నిర్వహించాలని ఆమె కోరారు. పరీక్షలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుందన్నారు.
విద్యార్థుల నుంచి వస్తోన్న డిమాండ్‌పై సీబీఎస్ఈ అధికారులు స్పందించారు. పరీక్షల నిర్వహణలో అన్ని రకాల కోవిడ్ నిబంధనలను పాటిస్తామని, ఇందులో భాగంగానే పరీక్ష కేంద్రాలను 40 నుంచి 50 శాతం మేర పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చిన్నారుల్లోనూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మరి సీబీఎస్ఈ బోర్డ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా.? లేదా పరీక్షలు నిర్వహిస్తోందో చూడాలి.
పరీక్షలపై అసత్య ప్రచారాలు చేయొద్దు..
షెడ్యూల్ ప్రకారమే వార్షిక పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సీబీఎస్ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ గెర్రీ అరాథూన్ కూడా స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దన్నారు. మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా, కరోనా కారణంగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

