మధ్యాహ్నం భోజనాలు కాగానే ఐదారుగురు మగవాళ్లు ఓ జంపఖానా పరిచి.. కూర్చొని పేకాట మొదలుపెట్టేవాళ్లు. ఇద్దరు బావలు, ఇద్దరు అన్నలు, మా చిన్న చిన్నాయనతోబాటు మా తాతయ్య కూడా ఆడేవాడు.
నాన్నా.. సైకిల్ కావాల్సిందే. స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పిస్తానని చెప్తున్నవ్. సెలవులొచ్చినయ్. ఇప్పుడు ఇప్పించకపోతే ఊరుకునేదే లేదు’ ఓ తండ్రికి నాలుగో తరగతి చదివే కొడుకు అల్టిమేటం.