సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సివిల్ ప్రాంతాలు త్వరలో మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రక్షణశాఖ కార్యదర్శి ఏ గిరిధర్ రాష్ట్ర అధికారులకు సూచించారు.
రక్షణశాఖ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అరమనె గిరిధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు.