జీహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్ ప్రాంతాలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సివిల్ ప్రాంతాలు త్వరలో మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రక్షణశాఖ కార్యదర్శి ఏ గిరిధర్ రాష్ట్ర అధికారులకు సూచించారు.
- విలీన ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్న కేంద్రం
- రాష్ట్ర అధికారులతో రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని సివిల్ ప్రాంతాలు త్వరలో మున్సిపాలిటీల్లో విలీనం కానున్నాయి. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రక్షణశాఖ కార్యదర్శి ఏ గిరిధర్ రాష్ట్ర అధికారులకు సూచించారు. బ్రిటిష్ కాలం నుంచి దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు.
కంటోన్మెంట్ల పరిధిలోని సివిల్ ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే విధివిధానాలపై మంగళవారం ఆయన ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతి కుమారి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనంచేయాలన్న కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని ఆమె తెలిపారు.
ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్టు చెప్పారు. సంబంధిత విధివిధానాల ఖరారు కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోలేదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, మున్సిపల్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూడా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

