అమెరికా కాన్సులేట్‌కు చెందిన వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వాహనాలను వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. బేగంపేట్ నుంచి నానక్ రాంగూడకు కాన్సులేట్ కార్యాలయాన్ని గతేడాదిలో మార్చారు.
అమెరికా వీసా ఇక ఈజీ కానుంది. రోజులు, నెలలకొద్దీ వేచి చూసే సమస్య తీరనుంది. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యాలయ నూతన భవన నిర్మాణం పూర్తవడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించింది.