ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)ల పరిస్థితి. పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యం వీరికి శాపంగా మారుతున్నది.
డిజిటల్ క్రాప్ సర్వే చేయని వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై వ్యవసాయ శాఖ కక్షసాధింపు చర్యలకు దిగింది. తమ మాట వినడంలేదనే కోపంతో రైతుబీమాలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణం చూపుతూ తాత్కాలికంగా విధుల �