AEO | ఏఈవోల అరిగోస.. 4 నెలలుగా క్షణం తీరిక లేకుండా విధులు!
వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓలు)పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. మూడు, నాలుగు నెలలుగా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది.
- అన్ని బాధ్యతలు వారిపైనే
- 4 నెలలుగా క్షణం తీరికలేకుండా వ్యవసాయ విస్తరణ అధికారులు
- పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి
AEO | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓలు)పనిభారంతో ఇబ్బంది పడుతున్నారు. మూడు, నాలుగు నెలలుగా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక పని పూర్తికాక ముందే, మరో పని అప్పగిస్తుండడంతో ఏ పనిచేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రుణమాఫీతో మొదలైన వీరి కష్టాలు పంటనష్టం సర్వే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. రుణమాఫీ మొత్తం గందరగోళం కావడంతో క్షేత్రస్థాయిలో ఏఈవోలు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. రైతులకు నేరుగా అందుబాటులో ఉండడంతో రుణమాఫీ కాని రైతులు ఏఈవోలను నిలదీస్తున్నారు.
ఇటు రుణమాఫీ గొడవ నడుస్తుండగానే, మరోవైపు పంటల సాగు నమోదు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్లపైనే పడడంతో వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. రేషన్‌కార్డు లేక రుణమాఫీ కాని రైతు కుటుంబాలను నిర్ధారించే బాధ్యతను కూడా ప్రభుత్వం వీరికే అప్పగించింది. దీంతో ఏఈవోలు రైతుల ఇండ్లకు వెళ్లి సర్వే చేస్తున్నారు. తాజాగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు ఏఈవోల కష్టాలను మరింత పెంచాయి. భారీ వర్షాలకు పంటలు నీట మునగడం, కొట్టుకుపోవడంతో నష్ట పరిహారం కోసం సర్వే చేయాల్సి ఉంది. ఈ బాధ్యతను కూడా అధికారులు ఏఈవోలపైనే పెట్టారు. పనిభారం తగ్గించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

