సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో సాగర్ ఎడమ కాలువ (Sagar Left Canal) ఎస్కేప్ గేటు (Escape Gate) ఊడిపోయింది. కాలువ కోతకు గురవడంతో పంట పొలాలు నీటమునిగాయి. అప్రమత్తమైన అధికారులు ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. కాగా, పోలేనిగూడెం, బేతవోలు తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లోకి నీరు చేరింది. రెగ్యులేటింగ్ గేటు తుప్పుపట్టి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ.. ఖమ్మంలోని పాలేరు చెరువు నింపేందుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు (NSP) అధికారులు నీటిని విడుదల చేశారని రైతులు ఆరోపించారు. అందువల్లే ఈ ఘటన చోటుచేసుకున్నదని చెప్పారు.