హుజూర్నగర్: చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరపాలని జీవోను విడుదల చేయడంతో ఆదివారం ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్షీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఉన్నతికి పాటుపడేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథరెడ్డి, బెల్లంకొండ అమర్ గూడెపు నాగలింగం, రేపాకుల కోటయ్య, నారాయణ, దుగ్గి వర్మ, పెద్దారపు శంకర్, దుగ్గి సైదులు, గూడెపు బ్రహ్మం పాల్గొన్నారు.