సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గాలి దుమారం తీవ్రతకు సిరికొండ గ్రామంలో భారీ వృక్షం ప్రభుత్వ పాఠశాల భవనం పై కూలడంతో పై కప్పు దెబ్బతింది. రాఘవాపురం క్రాస్ రోడ్డులో గల కిరాణా షాప్, ట్రాక్టర్ మెకానిక్ షెడ్ పూర్తిగా ధ్వంసం అయి ఆస్తి నష్టం వాటిల్లింది.
గోడలు కూలడంతో పాటు, నివాస గృహలపై కప్పులు ఎగిరిపోయి అస్తవ్యస్తంగా మారాయి. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నెలకొరిగి రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో గ్రామాల్లో విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.